ఫన్ రైడ్ గా సుధాకర్ 'నారాయణ అండ్ కో' టీజర్

by సూర్య | Wed, Mar 29, 2023, 07:44 PM

చిన్న పాపిశెట్టి దర్శకత్వంలో సుధాకర్ కోమాకుల ఒక సినిమాని అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'నారాయణ అండ్ కో' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజాగా ఈరోజు ఈ సినిమా టీజర్‌ను దర్శకుడు శేఖర్ కమ్ముల లాంచ్ చేశారు. ఈ సినిమా టీజర్ కామెడీగా అందరిని ఆకట్టుకుంటుంది. సుధాకర్ కామిక్ టైమింగ్ మరియు చివరి సీక్వెన్స్ హాస్యభరితంగా ఉంది.

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ట్రాక్ లో రానున్న ఈ సినిమాలో ఆమని, దేవి ప్రసాద్, జై కృష్ణ, పూజ కిరణ్, ఆరతి పొడి, యామిని బి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సురేష్ బొబ్బిలి, డాక్టర్ జోస్యభట్ల, నాగ వంశీ త్రయం సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రాహుల్ శ్రీవాత్సవ్ సినిమాటోగ్రఫీ అందించారు. పాపిశెట్టి ఫిల్మ్ ప్రొడక్షన్స్ మరియు సుఖ మీడియా బ్యానర్లపై పాపిశెట్టి బ్రదర్స్‌తో కలిసి సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Latest News
 
సినిమాల్లోకి స్టార్ హిరో వడ్డే నవీన్ రీఎంట్రీ Fri, Jul 11, 2025, 08:48 PM
పవన్ కల్యాణ్ మాజీ భార్యకు సర్జరీ Fri, Jul 11, 2025, 08:41 PM
ఓజీ రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్ Fri, Jul 11, 2025, 08:39 PM
'OG' నుండి స్పెషల్ పోస్టర్ అవుట్ Fri, Jul 11, 2025, 07:00 PM
10వ వార్షికోత్సవం సందర్భంగా కలిసిన 'బాహుబలి' బృందం Fri, Jul 11, 2025, 06:57 PM