మరో రెండు భాషల్లో డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులో ధనుష్ సర్/ వాతి

by సూర్య | Wed, Mar 29, 2023, 07:31 PM

వెంకీ అట్లూరి దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన 'వాతి' /'సర్' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌లో డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకు ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంది. తాజాగా ఈ రోజు, నెట్‌ఫ్లిక్స్ తన ప్లాట్‌ఫారమ్‌లో మలయాళం మరియు కన్నడ భాషలలో ప్రసారం చేయడానికి కూడా అందుబాటులో ఈ సినిమా ఉన్నట్లు అధికారికంగా ప్రకటించింది.

ఈ సినిమాలో మలయాళ నటి సంయుక్తా మీనన్‌ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో తనికెళ్ల భరణి, సాయి కుమార్, నర్రా శ్రీనివాస్, హైపర్ ఆది కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌ "సర్" చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Latest News
 
ఓటీటీలోకి వ‌చ్చేసిన ‘మైదాన్’ మూవీ Wed, May 22, 2024, 01:54 PM
బంపర్ ఆఫర్ అందుకున్న మృణాల్ Wed, May 22, 2024, 11:03 AM
అతడి ప్రవర్తన చూసి భయమేసింది: హీరోయిన్ కాజల్ Wed, May 22, 2024, 10:21 AM
'రాజు యాదవ్' నాలగవ సింగల్ ని విడుదల చేయనున్న స్థార్ డైరెక్టర్ Tue, May 21, 2024, 08:45 PM
తన సినీ కెరీర్‌ను వదిలేయనున్న స్టార్ హీరోయిన్ Tue, May 21, 2024, 08:43 PM