సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తదుపరి చిత్రంలో విశ్వక్ సేన్

by సూర్య | Wed, Mar 29, 2023, 07:28 PM

మాస్ కా దాస్ విశ్వక్సేన్ 'దస్ కా ధమ్కీ' సినిమాతో గ్రాండ్ సక్సెస్‌ ని సొంతం చేసుకున్నాడు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో కూడా ఈ చిత్రం మంచి బిజినెస్ చేస్తోంది. తాజాగా ఈ రోజు, నటుడు పుట్టినరోజు సందర్భంగా తన కొత్త సినిమాని ప్రకటించారు. 'VS11' అని తాత్కాలికంగా పేరు పెట్టబడిన ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహించనున్నారు.

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, విశ్వక్సేన్ మునుపెన్నడూ చూడని మాస్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. హీరోయిన్, ఇతర నటీనటులు, సిబ్బంది వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో రాజమండ్రిలో ప్రారంభం కానుంది.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని ఖరారు చేసిన 'కీడా కోలా' Wed, Sep 11, 2024, 03:22 PM
'సుందరకాండ' ఫస్ట్ సింగల్ విడుదలకి టైమ్ లాక్ Wed, Sep 11, 2024, 03:17 PM
'హనుమాన్' మేకింగ్ వీడియో రిలీజ్ Wed, Sep 11, 2024, 03:14 PM
25M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'దేవర' ట్రైలర్ Wed, Sep 11, 2024, 03:10 PM
త్వరలో డిజిటల్ ఎంట్రీ ఇవ్వనున్న 'మారుతీ నగర్‌ సుబ్రమణ్యం' Wed, Sep 11, 2024, 03:00 PM