by సూర్య | Sun, Mar 26, 2023, 11:20 AM
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయ్యాడు. `ఆర్‌ఆర్‌ఆర్` ఆయన ఇమేజ్ ఇండియా దాటి పోయింది. ప్రపంచ ఆడియెన్స్ మాత్రమే కాదు, సెలబ్రిటీలు కూడా ఆయన నటనని అభినందిస్తున్నారు. ఆయనకు అభిమానులుగా మారుతున్నాయి. ఇంతటి ఇమేజ్‌ని సొంతం చేసుకున్న ఎన్టీఆర్ వ్యక్తిగా చాలా హుందాగా వ్యవరిస్తుండటం విశేషం.
ఇదిలా ఉంటే ఎన్టీఆర్‌కి 2011లో మ్యారేజ్ జరిగింది. లక్ష్మి ప్రణతిని ఆయన వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు భార్గవ్ రామ్, అభయ్ రామ్. తారక్ భార్య ప్రణతి పూర్తి ప్రైవేట్ లైఫ్‌కే పరిమితం. ఆమె బయటకు పెద్దగా రారు. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండరు. పూర్తి ఫ్యామిలీ లైఫ్‌కే పరిమితం అవుతున్నారు. అయితే ప్రణతిని తారక్ ఏమని పిలుస్తాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సహజంగా ఎవరైనా తన భార్యలను ముద్దుపేర్లతో పిలుస్తుంటారు. ఆ పేర్లతో తమ ప్రేమని వ్యక్తం చేస్తుంటారు.
మరి ఎన్టీఆర్.. తన భార్య ప్రణతిని ఏమని పిలుస్తాడో రివీల్ అయ్యింది. ప్రణతిని ముద్దుగా అమ్ములు పిలుస్తాడనే విషయం బయటపడింది. నేడు(మార్చి 26) తన భార్య లక్ష్మీ ప్రణతి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమెకి బర్త్ డే విషెస్ చెప్పాడు తారక్. ఇందులో `హ్యాపీ బర్త్ డే అమ్ములు` అని తెలిపారు. అయితే విషెష్ సింపుల్‌గానే చెప్పినా, ఓ రహస్యాన్ని బయటపెట్టాడు. ఇంట్లో భార్యని ఏమని పిలుస్తాడో వెల్లడించాడు. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ప్రణతికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. అన్నా పార్టీ లేదా అంటున్నారు. అంతేకాదు వదినమ్మ పేరు భలే ఉందంటున్నారు.