షూటింగ్ చివరి దశకు చేరుకున్న 'డెవిల్'

by సూర్య | Thu, Mar 23, 2023, 08:47 PM

నవీన్ మేడారం దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'డెవిల్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా నుంచి కళ్యాణ్ రామ్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ..... సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుందని తెలిపారు. నవీన్ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడని కూడా పేర్కొన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌ను త్వరలో పూర్తి చేసి, విడుదల తేదీని త్వరలో మూవీ మేకర్స్ ప్రకటించనున్నట్లు సమాచారం.

ఈ పీరియాడికల్ డ్రామాలో మాళవిక నాయర్ మహిళా ప్రధాన పాత్ర పోషిస్తుంది. అభిషేక్ పిక్చర్స్ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీత అందిస్తున్నారు.

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM