ఉగ్రం : ఫస్ట్ సింగిల్ 'దేవేరి' ఫుల్ సాంగ్ ఔట్

by సూర్య | Sun, Mar 19, 2023, 05:15 PM

అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న ఇంటెన్స్ పోలీస్ యాక్షన్ డ్రామా "ఉగ్రం". విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో మిర్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఏప్రిల్ 14వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రస్తుతం మ్యూజికల్ ప్రమోషన్స్ జరుపుకుంటుంది.


కొంతసేపటి క్రితమే ఉగ్రం నుండి ఫస్ట్ సింగిల్ 'దేవేరి' విడుదలయ్యింది. దేవేరి ..గుండెల్లో చేరి.. మదిలో మోగిందే ..సరిగమ సావేరి ... అని సాగే ఈ మెలోడియస్ బ్యూటిఫుల్ ట్రాక్ ని స్టార్ సింగర్ అనురాగ్ కులకర్ణి ఆలపించారు. ఈ పాటకు శ్రీమణి లిరిక్స్ అందించారు. శ్రీచరణ్ పాకాల స్వరపరిచారు. ఈ పాటను రౌడీ హీరో విజయ్ దేవరకొండ లాంచ్ చేసి, చిత్రబృందానికి బెస్ట్ విషెస్ తెలియచేసారు.

Latest News
 
బాలీవుడ్ లో ఉత్సహం నింపిన 'ఛావా' Tue, Feb 18, 2025, 11:42 AM
ఆ సినిమా నా ఆత్మకథ Tue, Feb 18, 2025, 11:40 AM
బాలీవుడ్ ని షేక్ చేస్తున్న కన్నడ భామలు Tue, Feb 18, 2025, 11:38 AM
రాంప్రసాద్ ప్రధాన పాత్రలో 'W/O అనిర్వేష్' Tue, Feb 18, 2025, 11:31 AM
ఈ నెల 26న విడుదల కానున్న 'మజాకా' Tue, Feb 18, 2025, 11:28 AM