రామన్న యూత్ : 'ఓ సుందరి' ఫస్ట్ సింగిల్ లిరికల్ షీట్

by సూర్య | Sun, Mar 19, 2023, 05:07 PM

పల్లవి :


రాజుగాని మెళ్ళోన
సిలకల పేరు నువ్వేనే
మోజుపడ్డడే నీ పైనే ఓ సప్నా
రాజ్యమేది లేకున్నా
హల్చల్ చేస్తడే ఊళ్ళోనే
రాణి లెక్కన సూస్తాడే ఓ సప్నా
నువ్ దారం వీడో బీడీ
మస్తుంటదే ఇద్దరి జోడి
ఇల్లుటమే రమ్మంటొస్తడే
సుందరి.. ఓ ..సుందరి...
చరణం :1
బుంగమూతే సూస్తాంటే
కల్లు బుంగే యాదొచ్చే
బుగ్గ లెక్కనే పైకెగిరిందే గుండె
కట్ట పొంటి పోతాంటే
కొంటె సైగలు జేస్తాంటే
గుచ్చుకున్నయే సూపుల
శాపాల ముండ్లే
పోద్దాడు వాకిడ వీడే
నువ్వంటే పడి సస్తడే
నవ్వితే నీ ముళ్ళెం పోతదే
సుందరి.. ఓ ..సుందరి...
చరణం : 2
కనబడకుంటే పూటే
యినబడకుంటే మాటే
పిస పిస్సగా ఉంటదే
నా మనసంతా
ఎదురుగ నువ్వుంటే
ఏం పుడ్తదో ఏమోనే
ఉల్టా పల్టయ్యే పతంగినౌతా
నా జమ్మి చెట్టు నువ్వే
నా పాలపిట్ట నువ్వే
బతుకంతా దసరా జెయ్యవే
సుందరి.. ఓ ..సుందరి...



సంగీతం : కమ్రాన్
సాహిత్యం : కాసర్ల శ్యామ్
గాయకులూ : రాహుల్ సిప్లిగంజ్

Latest News
 
వార్‌ 2 సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్ Fri, Oct 04, 2024, 12:53 PM
మంత్రి కొండా సురేఖను వదిలి పెట్టను : అఖిల్ అక్కినేని Fri, Oct 04, 2024, 11:21 AM
దసరా సందర్భంగా మత్తువదలరా 2 మూవీ టీమ్ నుంచి క్రేజీ ఆఫర్ Fri, Oct 04, 2024, 11:00 AM
గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న ఆయేషా ఖాన్ Fri, Oct 04, 2024, 10:39 AM
కొండా సురేఖ వ్యాఖ్యలపై రకుల్ ప్రీత్ సింగ్ ఫైర్ Thu, Oct 03, 2024, 08:22 PM