విజయవాడకు "బలగం" చిత్రబృందం

by సూర్య | Sun, Mar 19, 2023, 04:46 PM

మార్చి 3న సైలెంట్ గా థియేటర్లకు వచ్చిన "బలగం" మూవీ విడుదల తరవాత బాక్సాఫీస్ వద్ద భీకర కలెక్షన్లతో బిగ్గరగా గర్జిస్తోంది. చిన్న సినిమా అనే ట్యాగ్ కి మించిన కలెక్షన్లను నమోదు చేస్తూ, ఈ మధ్య తెలుగులో విడుదలైన చిన్న సినిమాలలో ది బెస్ట్ గా నిలుస్తుంది. కమెడియన్ వేణు డైరెక్టర్ గా మారి రూపొందించిన ఈ సినిమాలో ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా నటించారు. భీమ్స్ సంగీతం అందించారు. తెలంగాణాలో ముమ్మర పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ ను జరుపుకున్న ఈ సినిమా చిత్రబృందం తాజాగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి రానుంది. విజయవాడ, క్యాపిటల్ సినిమాస్ లో బలగం మూవీ టీం హల్చల్ చేయబోతుంది.

Latest News
 
'యానిమల్' మూవీకి ఉత్తమ దర్శకుడు అవార్డును గెలుచుకున్నా సందీప్ రెడ్డి వంగా Tue, Feb 20, 2024, 11:19 PM
హనుమాన్ నుంచి 'రఘునందన' సాంగ్ రిలీజ్ Tue, Feb 20, 2024, 09:45 PM
నెట్‌ఫ్లిక్స్‌లో 'యానిమల్' మ్యానియా Tue, Feb 20, 2024, 09:20 PM
రామ్ చరణ్-బుచ్చిబాబు సినిమా లాంచ్ ఎప్పుడంటే....! Tue, Feb 20, 2024, 09:17 PM
'ట్రూ లవర్' డిజిటల్ అరంగేట్రం అప్పుడేనా? Tue, Feb 20, 2024, 09:08 PM