వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధమైన కాంతార హిందీ వెర్షన్

by సూర్య | Sun, Mar 19, 2023, 04:39 PM

కన్నడలో సెన్సేషన్ సృష్టించి, ఆపై ఇతర ప్రాంతీయ భాషల్లో విడుదలై అక్కడ కూడా ప్రభంజన విజయం సాధించిన "కాంతార" డిజిటల్ రంగంలో కూడా సూపర్ హిట్ గా నిలిచింది. కన్నడ నటుడు రిషబ్ శెట్టి డైరెక్ట్ చేసి, హీరోగా నటించిన ఈ సినిమాను ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ నిర్మించగా, అజనీష్ లోక్ నాధ్ సంగీతం అందించారు. కిషోర్, అచ్యుత్ కుమార్ ముఖ్యపాత్రల్లో నటించారు.


హిందీ ప్రేక్షకులను విశేషంగా మెప్పించిన కాంతార ఇప్పుడు బాలీవుడ్ బుల్లితెరపై సందడి చెయ్యడానికి సిద్ధమయ్యింది. ఈ రోజు రాత్రి ఎనిమిదింటికి సోనీ మాక్స్ లో కాంతార హిందీ వెర్షన్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కాబోతుంది.

Latest News
 
మ్యూజిక్ ప్రమోషన్స్ ని ప్రారంభించిన 'మట్కా' Sat, Oct 12, 2024, 08:31 PM
విడుదల తేదీని ఖరారు చేసిన 'బ్రహ్మ ఆనందం' Sat, Oct 12, 2024, 08:26 PM
శ్రీకాంత్ ఒదెలాతో నాని పాన్ ఇండియా ఫిల్మ్ ప్రారంభం Sat, Oct 12, 2024, 08:24 PM
'NBK 109' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Sat, Oct 12, 2024, 08:19 PM
సంక్రాంతి ట్రాక్ లో 'గేమ్ ఛేంజర్' Sat, Oct 12, 2024, 08:13 PM