కాంతార ఇకపై ఇటలీ, స్పెయిన్లలో కూడా..!!

by సూర్య | Sun, Mar 19, 2023, 04:25 PM

శాండల్ వుడ్ సెన్సేషన్ "కాంతార" పాన్ ఇండియా లెవెల్లో సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. రిషబ్ శెట్టి డైరెక్ట్ చేసి, హీరోగా నటించిన ఈ సినిమాను హోంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరంగదుర్ నిర్మించారు. కాంతారా సినిమాకు పాన్ ఇండియా ప్రేక్షకుల నుండి వచ్చిన విశేష స్పందన కారణంగా సీక్వెల్ పై భారీ అంచనాలున్నాయి.


తాజా సమాచారం ప్రకారం, కాంతార మూవీ అతి త్వరలోనే ఇటలీ మరియు స్పెయిన్ దేశాలలో సంబంధిత భాషల్లో విడుదల కాబోతుందని అధికారికంగా తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన డబ్బింగ్ పనులు జరుగుతున్నాయట.
సప్తమి గౌడ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా, కిషోర్ కుమార్, అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి ఇతర కీలకపాత్రల్లో నటించారు. అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించారు.

Latest News
 
బంపర్ ఆఫర్ అందుకున్న మృణాల్ Wed, May 22, 2024, 11:03 AM
అతడి ప్రవర్తన చూసి భయమేసింది: హీరోయిన్ కాజల్ Wed, May 22, 2024, 10:21 AM
'రాజు యాదవ్' నాలగవ సింగల్ ని విడుదల చేయనున్న స్థార్ డైరెక్టర్ Tue, May 21, 2024, 08:45 PM
తన సినీ కెరీర్‌ను వదిలేయనున్న స్టార్ హీరోయిన్ Tue, May 21, 2024, 08:43 PM
'రత్నం' డిజిటల్ అరంగేట్రం ఎప్పుడంటే...! Tue, May 21, 2024, 08:41 PM