పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన విశ్వక్ సేన్ కొత్త చిత్రం

by సూర్య | Sun, Mar 19, 2023, 12:58 PM

'దాస్ కా ధమ్కీ' చిత్రంతో మరో మూడ్రోజుల్లో ప్రేక్షకులను థియేటర్లలో పలకరించేందుకు సిద్ధంగా ఉన్న హీరో విశ్వక్ సేన్ తాజాగా ఈ రోజు తన కొత్త చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించారు. విశ్వక్ సేన్ కెరీర్ లో 10వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా ఈ రోజే అధికారిక పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం అయ్యింది. పూజా కార్యక్రమంలో స్టార్ రైటర్ BVS రవి పాల్గొని కెమెరా స్విచ్ ఆన్ చెయ్యగా, రజని తాళ్లూరి ఫస్ట్ క్లాప్ ఇచ్చారు.


ఈ సినిమాకు రవితేజ ముళ్ళపూడి దర్శకుడు కాగా, హిట్ 2 హీరోయిన్ మీనాక్షి చౌదరి విశ్వక్ కు జోడిగా నటిస్తుంది. జెక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. SRT మూవీస్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. అతి త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

Latest News
 
'పొన్నియిన్ సెల్వన్-2' మూవీ ట్రైలర్ రిలీజ్ Wed, Mar 29, 2023, 10:02 PM
వెంకటేశ్ 'సైంధవ్' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ Wed, Mar 29, 2023, 09:44 PM
'ధమ్కీ' 7 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Wed, Mar 29, 2023, 09:01 PM
ఫన్ రైడ్ గా సుధాకర్ 'నారాయణ అండ్ కో' టీజర్ Wed, Mar 29, 2023, 07:44 PM
మరో రెండు భాషల్లో డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులో ధనుష్ సర్/ వాతి Wed, Mar 29, 2023, 07:31 PM