ఎన్టీఆర్ 30 అఫీషియల్ లాంచ్ డేట్ ఫిక్స్.. ఆనందంలో అభిమానులు

by సూర్య | Sun, Mar 19, 2023, 11:25 AM

నాటు నాటు ఆస్కార్ విజయోత్సవ సంబరాలు ఇంకా ముగియక ముందే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు మరొక బిగ్ సర్ప్రైజ్ అందింది. ఎప్పుడెప్పుడా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసిన ఎన్టీఆర్ 30 అఫీషియల్ లాంచ్ డేట్ కి సంబంధించిన అధికారిక ప్రకటన రానే వచ్చేసింది. జరిగిన ప్రచారం మేరకు ఈ నెల 23న అంటే ఈ గురువారం అధికారిక పూజా కార్యక్రమాలతో ఎన్టీఆర్ 30 లాంచ్ కాబోతుందని తెలుస్తుంది. ఈ మేరకు విడుదల ఐన అఫీషియల్ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది.


కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ అందం జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించనుంది. నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్త బ్యానర్ లపై మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. కళ్యాణ్ రామ్ సమర్పిస్తున్నారు. అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
సంగీత దర్శకుడు AR రెహమాన్ కు అస్వస్థత Sun, Mar 16, 2025, 11:22 AM
నటి రన్యా రావు సంచలన ఆరోపణలు Sun, Mar 16, 2025, 11:17 AM
‘ది ప్యారడైజ్’ కీలక పాత్ర కోసం బాలీవుడ్ హీరోయిన్ ? Sun, Mar 16, 2025, 10:42 AM
హీరో విశ్వక్ సేన్ సోదరి ఇంట్లో భారీ చోరీ Sun, Mar 16, 2025, 10:35 AM
'జాక్' సెకండ్ సింగల్ విడుదల ఎప్పుడంటే..! Sat, Mar 15, 2025, 08:49 PM