కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు

by సూర్య | Sun, Mar 19, 2023, 11:20 AM

నటుడు, నిర్మాత, విద్యావేత్త శ్రీ. మంచు మోహన్ బాబు గారి జన్మదినం నేడు. 19, మర్చి, 1952లో తిరుపతి లో మంచు నారాయణ స్వామి, మంచు లక్ష్మమ్మ దంపతులకు జన్మించిన మంచు భక్తవత్సలం సినీరంగంలో మోహన్ బాబుగా పునరావిర్భవించారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్టర్ గా మోహన్ బాబు గారి ప్రొఫెషనల్ కెరీర్ ఆరంభం అయ్యింది. ఈ తరుణంలో దాసరినారాయణరావు గారితో పరిచయం మోహన్ బాబుని సినీరంగానికి దగ్గర చేసింది. దాసరి దర్శకత్వంలో 1975లో వచ్చిన 'స్వర్గం - నరకం' సినిమా మోహన్ బాబు సినీ కెరీర్ కి మంచి ఆరంభాన్నిచ్చింది. ఆపై లీడ్ హీరోగా, విలన్గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా మోహన్ బాబు 500కి పైగా సినిమాలలో అలవోకగా నటించారు. విద్య మీద ఆయనకున్న మక్కువ శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కి పురుడు పోసింది.


 

Latest News
 
'బలగం' 20 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Thu, Mar 23, 2023, 08:06 PM
'సర్' 31 రోజుల AP/TS కలెక్షన్స్ Thu, Mar 23, 2023, 07:50 PM
OTTలో సెన్సేషన్ ని సృష్టిస్తున్న కింగ్ ఖాన్ యొక్క 'పఠాన్' Thu, Mar 23, 2023, 07:49 PM
'వినరో భాగ్యము విష్ణు కథ' 31 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Thu, Mar 23, 2023, 07:46 PM
'పొన్నియిన్ సెల్వన్ 2' ట్రైలర్ విడుదల అప్పుడేనా? Thu, Mar 23, 2023, 07:44 PM