విశ్వక్ సేన్ లో నాకు నచ్చింది కాన్ఫిడెన్స్ : ఎన్టీఆర్

by సూర్య | Fri, Mar 17, 2023, 11:24 PM

విశ్వక్ సేన్ హీరోగా నటించి దర్శకత్వం వహించిన సినిమా 'దాస్ కా ధమ్కీ'. ఈ సినిమాలో నివేత పేతురాజ్ హీరోయినిగా నటించింది. ఈ  సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఈవెంట్‌ లో ఎన్టీఆర్ మాట్లాడ్తూ...'ఆర్ఆర్ఆర్' సినిమా ఈ రోజు ప్రపంచ పటంలో నిలబడింది, ఆస్కార్ అవార్డ్ వచ్చింది అంటే.. రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్, ప్రేమ్ రక్షిత్ ఎంత కారణమో తెలుగు చలన చిత్ర పరిశ్రమ కూడా అంతే కారణం. అలాగే యావత్ తెలుగు జాతి కారణం అని ఎన్టీఆర్ అన్నారు. 


విశ్వక్ సేన్ లాగా నేను మైక్‌లో మాట్లాడలేను అని అన్నారు. నేను చూసే సినిమాలలో  ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా ఒకటి. ఆ తరువాత వచ్చిన 'ఫ‌ల‌క్‌నుమాదాస్' సినిమా ఇష్టం అని ఎన్టీఆర్ అన్నారు. నటుడిగా .. దర్శకుడిగా విశ్వక్ సేన్ లో  నాకు నచ్చింది కాన్ఫిడెన్స్ అని, అయితే 'పాగల్' సినిమా తరువాత విశ్వక్ సేన్ ఒక చట్రంలోకి వెళ్లిపోతున్నాడేమో అని నేను అనుకుంటున్న సమయంలో ఆయన 'అశోకవనంలో అర్జున కల్యాణం' సినిమా చేశాడు. ఆ సినిమాలోని పాత్ర కోసం ఆయన మారిపోయిన తీరు చూస్తే నాకే ఆశ్చర్యమేసింది అని ఎన్టీఆర్ అన్నారు. నటుడుగా తనను తాను ప్రూవ్ చేసుకోవాలి అని అనుకునే వ్యక్తి విశ్వక్ సేన్, 'దాస్ కా ధమ్కీ' ఈ నెల 22న వస్తోంది. తప్పకుండా బ్లాక్ బస్టర్ హిట్ కావాలి. అయితే ఈ సినిమాతో విశ్వక్ దర్శకత్వం మానేసి.. కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వాలి అని ఎన్టీఆర్ అన్నారు. ఈ సినిమాకు ఉన్నదంతా పెట్టేశానని విశ్వక్ సేన్ చెప్పాడని, సినిమా అంటే అతనికి అంత పిచ్చి అని ఎన్టీఆర్ చెప్పారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలి అని  ఎన్టీఆర్ ఆకాంక్షించారు.  


 


 


 


 


 


 


 

Latest News
 
'దసరా' మూవీపై మహేష్ ప్రశంసలు Fri, Mar 31, 2023, 11:58 PM
రిరిలీజ్ కాబోతున్న 'ఈ నగరానికి ఏమైంది' మూవీ Fri, Mar 31, 2023, 11:31 PM
'ధమ్కీ' 9 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Fri, Mar 31, 2023, 08:58 PM
షూటింగ్ పూర్తి చేసుకున్న మెగా హీరో కొత్త చిత్రం Fri, Mar 31, 2023, 08:57 PM
'బలగం' 28 రోజుల AP/TS కలెక్షన్స్ Fri, Mar 31, 2023, 08:52 PM