నాని 'దసరా' రన్‌టైమ్ లాక్

by సూర్య | Fri, Mar 17, 2023, 05:54 PM

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని "దసరా" సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం 2 గంటల 29 నిమిషాల రన్‌టైమ్‌ను కలిగి ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని త్వరలో మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ సినిమా మార్చి 30, 2023న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

ఈ సినిమాలో నాని సరసన కీర్తి సురేష్ జోడిగా నటిస్తుంది. యాక్షన్ డ్రామాగా ట్రాక్ లో వస్తున్న ఈ సినిమాలో సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
'దసరా' మూవీపై మహేష్ ప్రశంసలు Fri, Mar 31, 2023, 11:58 PM
రిరిలీజ్ కాబోతున్న 'ఈ నగరానికి ఏమైంది' మూవీ Fri, Mar 31, 2023, 11:31 PM
'ధమ్కీ' 9 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Fri, Mar 31, 2023, 08:58 PM
షూటింగ్ పూర్తి చేసుకున్న మెగా హీరో కొత్త చిత్రం Fri, Mar 31, 2023, 08:57 PM
'బలగం' 28 రోజుల AP/TS కలెక్షన్స్ Fri, Mar 31, 2023, 08:52 PM