లేటెస్ట్ : 'భోళా శంకర్' లో అక్కినేని హీరో ..!!

by సూర్య | Fri, Mar 17, 2023, 05:46 PM

దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం "భోళా శంకర్". కోలీవుడ్ సూపర్ హిట్ చిత్రం "వేదాళం" కి అఫీషియల్ తెలుగు రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. మెగాస్టార్ కి చెల్లెలిగా కీర్తి సురేష్  నటిస్తున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో మరొక కొత్త నటుడు చేరినట్టుగా తెలుస్తుంది. అక్కినేని హీరో సుశాంత్ భోళా శంకర్ లో కీర్తి సురేష్ బాయ్ ఫ్రెండ్ గా నటించబోతున్నాడట. అంతకుముందు ఈ పాత్రకు హీరో నితిన్ ని మేకర్స్ తీసుకున్నట్టుగా ప్రచారం జరిగింది. మరి, సుశాంత్ భోళా శంకర్ లో నటిస్తున్నాడనే విషయంపై అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది.

Latest News
 
'దసరా' మూవీపై మహేష్ ప్రశంసలు Fri, Mar 31, 2023, 11:58 PM
రిరిలీజ్ కాబోతున్న 'ఈ నగరానికి ఏమైంది' మూవీ Fri, Mar 31, 2023, 11:31 PM
'ధమ్కీ' 9 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Fri, Mar 31, 2023, 08:58 PM
షూటింగ్ పూర్తి చేసుకున్న మెగా హీరో కొత్త చిత్రం Fri, Mar 31, 2023, 08:57 PM
'బలగం' 28 రోజుల AP/TS కలెక్షన్స్ Fri, Mar 31, 2023, 08:52 PM