by సూర్య | Fri, Mar 17, 2023, 05:44 PM
రీసెంట్ సూపర్ హిట్ "సార్" మూవీ నుండి కొంతసేపటి క్రితమే 'మా రాజయ్య' వీడియో సాంగ్ విడుదలయ్యింది. సినిమాలో కీలక సన్నివేశంలో వచ్చే ఈ పాట ప్రేక్షకుల చేత కంటతడి పెట్టిస్తుంది. జీవీ ప్రకాష్ కుమార్ స్వరకల్పనలో రూపొందిన ఈ పాటను కాల భైరవ ఆలపించారు. సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి గారు సాహిత్యం అందించారు. పోతే, ఈ రోజు నుండే సార్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది.
ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకుడు కాగా, ధనుష్, సంయుక్త మీనన్ జంటగా నటించారు. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.
Latest News