NTR 32 పై సెన్సేషనల్ బజ్..!!

by సూర్య | Sun, Feb 05, 2023, 06:29 PM

RRR గ్లోబల్ సక్సెస్ తదుపరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు దర్శకుడు కొరటాల శివతో సినిమాకి కమిటైన విషయం తెలిసిందే. తారక్ కెరీర్ లో 30వ సినిమాగా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ తదుపరి 31వ సినిమా కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తో ఉంటుంది. ఇంకా కొరటాల శివ సినిమానే పట్టాలెక్కలేదు, ఆ తరవాత ప్రశాంత్ నీల్ సినిమా కూడా ఉంది..ఇవి రెండు పూర్తయ్యేటప్పటికే చాలా సమయం పట్టేటట్టు ఉండగా, తాజాగా ఎన్టీఆర్ 32వ సినిమాపై సెన్సేషనల్ బజ్ వినిపిస్తుంది.

కోలీవుడ్ దిగ్గజ దర్శకుడు వెట్రిమారన్ తో జూనియర్ ఎన్టీఆర్ ఒక పాన్ ఇండియా బిగ్ బడ్జెట్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ విషయం గతంలో కూడా ప్రచారమవ్వగా, తాజాగా మరోసారి వార్తల్లో హాట్ టాపిక్ గా నిలిచింది. ఐతే, ఈ సారి ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతుందని, మొదటి భాగంలో తారక్ లీడ్ లో నటిస్తాడని, రెండవ భాగంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ లీడ్ రోల్ లో నటిస్తారని టాక్ నడుస్తుంది.
ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్ వార్తల్లో మాత్రమే ఉంది..కానీ, ఈ వార్త నిజమైతే, చాలా బాగుంటుందని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.

 

Latest News
 
తమన్నా ఫోటోస్ ట్రెండింగ్ ! Sun, Mar 26, 2023, 11:54 AM
ట్రెండీ వేర్‌లో క‌వ్విస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ Sun, Mar 26, 2023, 11:24 AM
ఎన్టీఆర్‌ తన భార్యని పిలిచే ముద్దు పేరేంటో తెలుసా? Sun, Mar 26, 2023, 11:20 AM
సినీ పరిశ్రమలో విషాదం Sun, Mar 26, 2023, 09:23 AM
‘రంగమార్తాండ’ ఓటీటీలోకి ఎప్పుడంటే.? Sun, Mar 26, 2023, 09:22 AM