మేనల్లుడి సినిమాకు ఆల్ ది బెస్ట్ చెప్పిన సూపర్ స్టార్..!!

by సూర్య | Sun, Feb 05, 2023, 06:10 PM

ఘట్టమనేని కుటుంబం నుండి వచ్చిన హీరోలలో యంగ్ హీరో అశోక్ గల్లా ఒకరు. 'హీరో'తో గతేడాది వెండితెర తెరంగేట్రం చేసిన అశోక్ గల్లా తాజాగా తన రెండవ సినిమా ప్రకటన చేసారు. ఈ రోజే అశోక్ రెండవ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమయ్యింది. ఈ కార్యక్రమానికి విక్టరీ వెంకటేష్, నమ్రతా శిరోద్కర్, బోయపాటి శ్రీను, BVS రవి, సాహు గారపాటి, హరీష్ పెద్ది, మిర్యాల రవీందర్ రెడ్డి హాజరయ్యారు. శ్రీలలితాంబిక ప్రొడక్షన్స్ లో ఫస్ట్ ప్రాజెక్ట్ గా రూపొందుతున్న ఈ సినిమాకు 'గుణ 369' ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నారు.


ఈ నేపథ్యంలో తన మేనల్లుడి న్యూ ప్రాజెక్ట్ కి బెస్ట్ విషెస్ తెలియచేస్తూ, సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ట్వీట్ చేసారు. ఈ ప్రాజెక్ట్ సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకున్నారు. మహేష్ సర్ప్రైజింగ్ ట్వీట్ కి అశోక్ గల్లా థాంక్యూ అంటూ రిప్లై కూడా ఇచ్చారు. 

Latest News
 
ఐపీఎల్ కామెంటేటర్‌గా బాలకృష్ణ Sun, Mar 26, 2023, 08:54 PM
పవన్ సినిమాలో విలన్ గా నటించమని ఆ దర్శకుడు అడిగాడు : మంత్రి మల్లారెడ్డి Sun, Mar 26, 2023, 08:45 PM
తమన్నా ఫోటోస్ ట్రెండింగ్ ! Sun, Mar 26, 2023, 11:54 AM
ట్రెండీ వేర్‌లో క‌వ్విస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ Sun, Mar 26, 2023, 11:24 AM
ఎన్టీఆర్‌ తన భార్యని పిలిచే ముద్దు పేరేంటో తెలుసా? Sun, Mar 26, 2023, 11:20 AM