అజిత్ 'తునివు' డిజిటల్ ఎంట్రీ డేట్ ఫిక్స్ ..!!

by సూర్య | Fri, Feb 03, 2023, 09:16 AM

తాలా అజిత్ నుండి సంక్రాంతి కానుకగా విడుదలైన సినిమా "తునివు". తెలుగులో "తెగింపు". హెచ్ వినోద్ డైరెక్షన్లో బ్యాంకు దోపిడీ నేపథ్యంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కు ఆడియన్స్, క్రిటిక్స్ నుండి మిక్స్డ్ రివ్యూలు వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మ్యాజికల్ కలెక్షన్స్ వస్తున్నాయి. వరల్డ్ వైడ్ గా 225కోట్లకు పైగా కలెక్ట్ చేసి అజిత్ నటించిన సినిమాలలో ఈ మార్కు అందుకున్న తొలి చిత్రంగా తునివు రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.


తాజాగా ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యింది. ఈ నెల 8 నుండి తెలుగు, తమిళ భాషలలో నెట్ ఫ్లిక్స్ ఓటిటిలో తునివు/ తెగింపు డిజిటల్ స్ట్రీమింగ్ కి రాబోతుందని అఫీషియల్ ఎనౌన్స్మెంట్ జరిగింది.


మంజు వారియర్, సముద్రఖని కీరోల్స్ లో నటించిన ఈ సినిమాకు ఘిబ్రాన్ సంగీతం అందించారు. బోనీ కపూర్ నిర్మించారు.

Latest News
 
ఆ సినిమా సీక్వెల్ వారిద్దరూ చేస్తే బాగుంటుంది Sat, Apr 13, 2024, 10:09 PM
'జితేందర్ రెడ్డి' నుండి పాట విడుదల Sat, Apr 13, 2024, 10:08 PM
రామ్‌చరణ్‌ కి డాక్టరేట్‌ Sat, Apr 13, 2024, 10:06 PM
లేడీ ఓరియంటెడ్‌ సినిమాల్లో మంచి మెసేజ్‌ ఉంటుంది Sat, Apr 13, 2024, 10:06 PM
మంచి అవకాశాలు వచ్చాయి కాబట్టే, ఈ స్థాయిలోకి వచ్చాను Sat, Apr 13, 2024, 10:04 PM