![]() |
![]() |
by సూర్య | Fri, Feb 03, 2023, 09:30 AM
కళాతపస్వి శ్రీ కాశీనాథుని విశ్వనాథ్ గారు మహాభినిష్క్రమణం చేసారు. ఆయన తెరకెక్కించి, ప్రపంచవ్యాప్త మెప్పు పొందిన టైంలెస్ క్లాసిక్ "శంకరాభరణం" విడుదల తేదీ (ఫిబ్రవరి 2) నాడే కాలం చేసారు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విశ్వనాథ్ గారు గురువారం రాత్రి హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
సినిమా అనేది ఒక కళారూపమని, కథ, కథనం, సాహిత్యం, నృత్యం...వీటన్నిటితో పాటుగా మన సంస్కృతి, సంప్రదాయాలకి, లలిత కళలకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన గొప్ప దర్శకుడు విశ్వనాథ్ గారు. ఆయన సినిమాలలో తెలుగుదనం ఉట్టిపడుతుంది. టెక్నాలజీ పెరిగి, కాలం మారుతున్న వేళ, కాలంతో పాటుగా జనాల పోకడ మారుతున్న వేళ, భవిష్యత్తు తరాలకు ఇదిగో ఇది మన తెలుగువారి గొప్ప సంస్కృతి, సంప్రదాయం.. అని కళాతపస్వి సినిమాలను ఉదాహరణగా చూపించవచ్చు.
Latest News