మెగాస్టార్ 'గ్యాంగ్ లీడర్' రీ రిలీజ్ డేట్ ఫిక్స్..?

by సూర్య | Wed, Feb 01, 2023, 08:13 PM

మెగాస్టార్ చిరంజీవి గారి ఆల్ టైం బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్స్ లో "గ్యాంగ్ లీడర్" ఒకటి. విజయ బాపినీడు డైరెక్షన్లో క్రైమ్ యాక్షన్ ఫిలిం గా రూపొందిన ఈ సినిమా 1991లో విడుదలై ఘనవిజయం సాధించింది. ఇందులో విజయశాంతి హీరోయిన్ గా నటించగా, రావు గోపాలరావు, ఆనంద్ రాజ్, మురళి మోహన్, శరత్ కుమార్ కీరోల్స్ లో నటించారు. బప్పి లహరి సంగీతం అందించారు.


గ్యాంగ్ లీడర్ విడుదలై ముప్పై ఏళ్ళు నిండిన సందర్భంగా గతేడాది డిసెంబర్ 31 వ తేదీన మరొకసారి థియేటర్లలో సందడి చెయ్యడానికి రెడీ కాగా,  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ "ఖుషి" రీ రిలీజ్ కారణంగా గ్యాంగ్ లీడర్ మేకర్స్ తమ సినిమాను వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో తాజాగా గ్యాంగ్ లీడర్ మూవీ ఈ నెల 11న రీ రిలీజ్ కాబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి, ఈ విషయంపై అఫీషియల్ క్లారిటీ రావలసి ఉంది.

Latest News
 
తమన్నా ఫోటోస్ ట్రెండింగ్ ! Sun, Mar 26, 2023, 11:54 AM
ట్రెండీ వేర్‌లో క‌వ్విస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ Sun, Mar 26, 2023, 11:24 AM
ఎన్టీఆర్‌ తన భార్యని పిలిచే ముద్దు పేరేంటో తెలుసా? Sun, Mar 26, 2023, 11:20 AM
సినీ పరిశ్రమలో విషాదం Sun, Mar 26, 2023, 09:23 AM
‘రంగమార్తాండ’ ఓటీటీలోకి ఎప్పుడంటే.? Sun, Mar 26, 2023, 09:22 AM