రేపటి నుండే 'రైటర్ పద్మభూషణ్' పెయిడ్ ప్రీమియర్స్

by సూర్య | Wed, Feb 01, 2023, 07:51 PM

ట్రైలర్ తో ప్రేక్షకుల దృష్టిని విశేషంగా ఆకర్షించిన సినిమా "రైటర్ పద్మభూషణ్". స్పెషల్ ఫ్యామిలీ ప్రీమియర్స్ తో ఆడియన్స్ లో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న ఈ సినిమా రేపు ఇరు తెలుగు రాష్ట్రాలలో 27 పెయిడ్ ప్రీమియర్స్ ను నిర్వహించనుంది. పెయిడ్ ప్రీమియర్స్ కి కూడా ఆడియన్స్ నుండి చాలా మంచి స్పందన వస్తుంది. దీంతో ప్రీమియర్ షో టికెట్లు ఫాస్ట్ గా బుక్ అవుతున్నాయని తెలుస్తుంది.


సుహాస్, టీనా శిల్పారాజ్ జంటగా నటిస్తున్న ఈ సినిమా షణ్ముఖ ప్రశాంత్ డైరెక్ట్ చేసారు. లహరి ఫిలిమ్స్, చాయ్ బిస్కట్ ఫిలిమ్స్ సంయుక్త బ్యానర్ లపై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహరన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ నెల 3న థియేటర్లలో విడుదల కావడానికి సిద్ధమవుతోంది.

Latest News
 
ఐపీఎల్ కామెంటేటర్‌గా బాలకృష్ణ Sun, Mar 26, 2023, 08:54 PM
పవన్ సినిమాలో విలన్ గా నటించమని ఆ దర్శకుడు అడిగాడు : మంత్రి మల్లారెడ్డి Sun, Mar 26, 2023, 08:45 PM
తమన్నా ఫోటోస్ ట్రెండింగ్ ! Sun, Mar 26, 2023, 11:54 AM
ట్రెండీ వేర్‌లో క‌వ్విస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ Sun, Mar 26, 2023, 11:24 AM
ఎన్టీఆర్‌ తన భార్యని పిలిచే ముద్దు పేరేంటో తెలుసా? Sun, Mar 26, 2023, 11:20 AM