'మట్టికుస్తీ' నుండి 'మిర మిరపకాయ్' వీడియో సాంగ్ ఔట్

by సూర్య | Wed, Feb 01, 2023, 07:39 PM

FIR చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన కోలీవుడ్ నటుడు విష్ణు విశాల్ నుండి రీసెంట్గా వచ్చిన మూవీ "మట్టి కుస్తీ". తమిళంలో "గట్టకుస్తి". ఈ చిత్రానికి చెల్లా అయ్యవు దర్శకత్వం వహించగా, విష్ణు విశాల్ స్టూడియోస్, ఆర్ టీ టీం వర్క్స్ బ్యానర్ పై రవితేజ, విష్ణు విశాల్ నిర్మించారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్గా నటించింది. డిసెంబర్ 2న తెలుగు, తమిళ భాషలలో విడుదలైన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి డీసెంట్ రివ్యూస్ వచ్చాయి.


లేటెస్ట్ గా ఈ సినిమా నుండి 'మిర మిరపకాయ్' వీడియో సాంగ్ విడుదలైంది. హీరోను ప్రేక్షకులకు పరిచయం చేసే పాట ఇది. ఈ పాటను సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పాడగా, కృష్ణ కాంత్ లిరిక్స్ అందించారు.

Latest News
 
ఆ సినిమా సీక్వెల్ వారిద్దరూ చేస్తే బాగుంటుంది Sat, Apr 13, 2024, 10:09 PM
'జితేందర్ రెడ్డి' నుండి పాట విడుదల Sat, Apr 13, 2024, 10:08 PM
రామ్‌చరణ్‌ కి డాక్టరేట్‌ Sat, Apr 13, 2024, 10:06 PM
లేడీ ఓరియంటెడ్‌ సినిమాల్లో మంచి మెసేజ్‌ ఉంటుంది Sat, Apr 13, 2024, 10:06 PM
మంచి అవకాశాలు వచ్చాయి కాబట్టే, ఈ స్థాయిలోకి వచ్చాను Sat, Apr 13, 2024, 10:04 PM