అఫీషియల్ : ధనుష్ "వాతి" గ్రాండ్ ఆడియో లాంచ్ కి డేట్ ఫిక్స్

by సూర్య | Wed, Feb 01, 2023, 07:31 PM

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, సంయుక్తా మీనన్ జంటగా, వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ "సార్". తమిళంలో "వాతి". తెలుగు, తమిళ భాషలలో ఏకకాలంలో రూపొందుతున్న ఈ సినిమా నుండి ఇప్పటివరకు విడుదలైన రెండు లిరికల్ సాంగ్స్ శ్రోతలను విపరీతంగా మెప్పిస్తున్న విషయం తెలిసిందే.


వాతి ఆడియో లాంచ్ ఈవెంట్ ఫిబ్రవరి 4న గ్రాండ్ గా జరిపేందుకు మేకర్స్ రంగం సిద్ధం చేస్తున్నారంటూ జోరుగా జరిగిన ప్రచారం అందరికీ తెలుసు. తాజాగా ఈ విషయంపై అఫీషియల్ క్లారిటీ వస్తుంది. ఫిబ్రవరి నాల్గవ తేదీన వాతి గ్రాండ్ ఆడియో లాంచ్ ఈవెంట్ జరగబోతుందని కాసేపటి క్రితమే మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు.


నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ నెల 17న తెలుగు, తమిళ భాషలలో విడుదల కావడానికి రెడీ అవుతుంది.

Latest News
 
కార్తీ తదుపరి చిత్రంలో ప్రముఖ హీరో కీలక పాత్ర Fri, Jun 02, 2023, 08:56 PM
OTT ప్లాట్‌ఫారమ్‌ను లాక్ చేసిన 'పరేషన్' Fri, Jun 02, 2023, 08:54 PM
'మేమ్ ఫేమస్' 7 రోజుల AP/TS కలెక్షన్స్ Fri, Jun 02, 2023, 07:00 PM
డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'ఉగ్రం' Fri, Jun 02, 2023, 06:51 PM
'బిచ్చగాడు 2' 13 రోజుల డే వైస్ AP/TS కలెక్షన్స్ Fri, Jun 02, 2023, 06:42 PM