బుట్టబొమ్మ ట్రైలర్ తో పెరిగిన అంచనాలు..!!

by సూర్య | Mon, Jan 30, 2023, 04:58 PM

చైల్డ్ ఆర్టిస్ట్ అనిఖా సురేంద్రన్ లీడ్ హీరోయిన్ గా డిబట్ ఎంట్రీ ఇస్తున్న చిత్రం "బుట్టబొమ్మ". ఇందులో అర్జున్ రామ్ దాస్, సూర్య వసిష్ఠ మేల్ లీడ్స్ లో నటిస్తున్నారు. శౌరీ చంద్రశేఖర్ టి రమేష్ డైరెక్ట్ చేస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
వచ్చే నెల నాల్గవ తేదీన థియేటర్లకు రాబోతున్న ఈ సినిమా నుండి విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ కు ఆడియన్స్ నుండి హార్ట్ వార్మింగ్ రెస్పాన్స్ వస్తుంది. ఫ్రెష్ కంటెంట్, ఫీల్ గుడ్ లవ్ స్టోరీ, నటీనటుల ఫ్రెష్ స్క్రీన్ ప్రెజెన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్..ఇలా అన్ని అద్భుతంగా ఉండడంతో ట్రైలర్ సినిమాపై ఒక్కసారిగా భారీ అంచనాలను నమోదు చేసింది. పోతే, ఈ ట్రైలర్ 4 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ ట్రెండింగ్ వీడియోస్ లో ఒకటిగా ట్రెండ్ అవుతుంది.

Latest News
 
టాలీవుడ్ నాకు ప్రత్యేకం: పూజా హెగ్డే Tue, Jun 18, 2024, 12:25 PM
జాన్వీకపూర్ పేరుతో ఫేక్ ట్విట్టర్ అకౌంట్లు Tue, Jun 18, 2024, 11:06 AM
మగబిడ్డకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్ Tue, Jun 18, 2024, 10:49 AM
హీరో దర్శన్ కేసుపై స్పందించిన నటుడు Tue, Jun 18, 2024, 10:47 AM
USAలో $200K మార్క్ ని చేరుకున్న 'మహారాజా' Mon, Jun 17, 2024, 10:28 PM