అట్లాంటిక్‌కి ఇరువైపులా $1 మిలియన్ వసూలు చేసిన 'వరిసు'

by సూర్య | Fri, Jan 27, 2023, 05:51 PM

తమిళ స్టార్ హీరో తలపతి విజయ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించిన 'వరిసు' సినిమా జనవరి 11, 2023న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, వరిసు సినిమా USA బాక్స్ఆఫీస్ వద్ద $1.13 మిలియన్ వసూళ్లు చేయగా, UK బాక్స్ఆఫీస్ వద్ద $1.03 మిలియన్లను రాబట్టింది. తలపతి విజయ్ నటించిన ఈ చిత్రం అట్లాంటిక్‌కు ఇరువైపులా $1 మిలియన్ వసూలు చేసింది అని ఇండస్ట్రీ ట్రాకర్ రమేష్ బాలా తన ట్విట్టర్‌లో వరిసు సినిమా కలెక్షన్స్ ని పోస్ట్ చేసి ఈ విషయాన్ని ధృవీకరించారు.

ఈ సినిమాలో విజయ్ సరసన కన్నడ బ్యూటీ రష్మిక జంటగా నటిస్తుంది. ప్రభు, ప్రకాష్ రాజ్, జయసుధ మరియు శరత్ కుమార్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి సెన్సషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు అండ్ శిరీష్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ఈ సినిమాని నిర్మించనున్నారు.

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM