ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్‌లో ట్రోఫీ ఆవిష్కరించనున్న దీపిక

by సూర్య | Tue, Dec 06, 2022, 10:59 AM

ఫిఫా వరల్డ్ కప్‌ ఫైనల్‌లో ట్రోఫీని హీరోయిన్ దీపికా పదుకొణె ఆవిష్కరించనుంది. డిసెంబర్ 18న జరగనున్న వేడుకలో ఈ అరుదైన గౌరవం ఆమెకు దక్కింది. ఈ కార్యక్రమంలో భాగంగా దీపిక త్వరలో ఖతార్ వెళ్లనుంది. ప్రేక్షకులతో కిక్కిరిసిన స్టేడియం సమక్షంలో ఫైనల్స్‌లో ప్రముఖ నటి ఫిఫా ప్రపంచ కప్‌ను ఆవిష్కరించనుంది. దీపికా పదుకొణె అంతర్జాతీయ వేదికపై దేశానికి ప్రాతినిధ్యం వహించడం భారతీయులకు గర్వకారణమని, పలువురు సెలబ్రెటీలు ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు. ఇక ఈ ఏడాది ఫ్రాన్స్‌లో జరిగిన 75వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో జ్యూరీ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వర్తించింది. మరోసారి అంతర్జాతీయ వేదికపై ఆమె కనపడనుంది.

Latest News
 
సూర్య 'కంగువ' మూవీ న్యూ పోస్టర్ రిలీజ్ Sun, Apr 14, 2024, 10:37 PM
తలపతి విజయ్ 'ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైం' మూవీ నుండి ఫస్ట్‌ సాంగ్‌ రిలీజ్ Sun, Apr 14, 2024, 09:46 PM
ఆ సినిమా సీక్వెల్ వారిద్దరూ చేస్తే బాగుంటుంది Sat, Apr 13, 2024, 10:09 PM
'జితేందర్ రెడ్డి' నుండి పాట విడుదల Sat, Apr 13, 2024, 10:08 PM
రామ్‌చరణ్‌ కి డాక్టరేట్‌ Sat, Apr 13, 2024, 10:06 PM