"వారసుడు" కి అన్నయ్యగా... రవితేజ విలన్ ..!!

by సూర్య | Tue, Dec 06, 2022, 08:05 AM

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, రష్మిక మండన్నా జంటగా, వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న చిత్రం "వారిసు". వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కావడానికి సంసిద్ధమవుతున్న ఈ సినిమా నుండి రీసెంట్గా 'థీ తలపతి' సాంగ్ విడుదలై శ్రోతలను విశేషంగా మెప్పిస్తుంది.


తాజా సమాచారం ప్రకారం, ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నటుడు శామ్ వారిసు మూవీపై ఆసక్తికర విషయాలను వెల్లడించారు. వారిసు మూవీలో విజయ్ కు అన్నగా నటిస్తున్నానని, విజయ్ కు తనకు కొన్ని ఘర్షణ సన్నివేశాలు ఉంటాయని, సినిమా మొత్తం ఒక పెద్ద కుటుంబం / కంపెనీ కి సంబంధించిన అధికారం దక్కించుకునేందుకు జరిగే పోరాటం చుట్టూ తిరుగుతుందని తెలిపారు. అలానే ఈ సినిమాలో 5 పాటలు 3 పెద్ద యాక్షన్ ఎపిసోడ్లు ఉంటాయని తెలిపారు. మాస్ రాజా రవితేజ సూపర్ హిట్ మూవీ "కిక్" సినిమాలో సూపర్ స్టైలిష్ కాప్ రోల్ లో నటించి తెలుగు ప్రేక్షకులకు శామ్ చేరువైన విషయం తెలిసిందే.


వచ్చే ఏడాది సంక్రాంతికి తెలుగులో "వారసుడు" టైటిల్ తో విడుదల కాబోతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. 

Latest News
 
మరోసారి వాయిదా పడిన పవన్ కళ్యాణ్ 'బద్రి' రీ రిలీజ్..!! Fri, Feb 03, 2023, 10:06 AM
సమంత 'శాకుంతలం' పై కీరవాణి ప్రశంసలు..!! Fri, Feb 03, 2023, 09:57 AM
కళాతపస్వి మరణంతో.. భావోద్వేగానికి గురైన చిరంజీవి Fri, Feb 03, 2023, 09:49 AM
ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న 'ముఖచిత్రం' Fri, Feb 03, 2023, 09:33 AM
శంకరాభరణం విడుదల తేదీనే కాలం చేసిన కళాతపస్వి ..!! Fri, Feb 03, 2023, 09:30 AM