![]() |
![]() |
by సూర్య | Sun, Dec 04, 2022, 06:47 PM
విలక్షణ నటుడు సత్యదేవ్ నుండి రాబోతున్న సరికొత్త చిత్రం "గుర్తుందా శీతాకాలం". ఇందులో తమన్నా, మేఘా ఆకాష్, కావ్యాశెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సుహాసిని మణిరత్నం కీరోల్ లో నటిస్తున్నారు. పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు ఈ నెల 9న తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతుంది.
ఈ నేపథ్యంలో మేకర్స్ గుర్తుందా శీతాకాలం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా జరిపేందుకు రంగం సిద్ధం చేసారు. హిట్ 2 సినిమాతో సెన్సేషనల్ విజయం సొంతం చేసుకున్న యంగ్ హీరో అడివిశేష్ గుర్తుందా శీతాకాలం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారని పేర్కొంటూ కొంతసేపటి క్రితమే మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు.
ఈమేరకు డిసెంబర్ 5వ తేదీన సాయంత్రం ఆరు గంటల నుండి హైదరాబాద్ లోని JRC కన్వెన్షన్స్ లో గుర్తుందా శీతాకాలం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.
Latest News