"వారిసు" నుండి 'థీ తలపతి' లిరికల్ సాంగ్ విడుదల ..!!

by సూర్య | Sun, Dec 04, 2022, 06:36 PM

తలపతి విజయ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న వారిసు మూవీ నుండి థీ తలపతి సెకండ్ లిరికల్ సాంగ్ కొంతసేపటి క్రితమే విడుదలైంది. ఈ పాట విశేషమేంటంటే, కోలీవుడ్ స్టార్ హీరో శింబు ఈ పాటను పాడడమే కాకుండా, ప్రమోషనల్ వీడియోలో నటించడం కూడా. వివేక్ లిరిక్స్ అందించగా, థమన్ సంగీతం అందించారు. ఫుల్ హీరో ఎలివేషన్స్ తో ఈ సాంగ్ అభిమానులను ఉర్రూతలూగిస్తుంది.


వంశీ పైడిపల్లి డైరెక్షన్లో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, రష్మిక మండన్నా జంటగా నటించిన వారిసు మూవీ తెలుగులో వారసుడు టైటిల్ తో విడుదల కాబోతుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


ప్రకాష్, రాజ్, జయసుధ, శరత్ కుమార్, ప్రభు, శ్రీకాంత్, సంగీత కీలకపాత్రలు పోషించిన ఈ సినిమా వచ్చే నెలలో సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది.

Latest News
 
మరోసారి చిక్కుల్లో పడ్డ నటుడు టామ్ చాకో Thu, Apr 17, 2025, 07:04 PM
రేపే 'థగ్ లైఫ్' ఫస్ట్ సింగల్ విడుదలకి తేదీ లాక్ Thu, Apr 17, 2025, 06:54 PM
'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' ఈ తేదీన విడుదల కానుందా? Thu, Apr 17, 2025, 06:50 PM
'సారంగపాణి జాతకం' ట్రైలర్ కి సాలిడ్ రెస్పాన్స్ Thu, Apr 17, 2025, 06:42 PM
'ఎల్ 2: ఎంప్యూరాన్' డిజిటల్ ఎంట్రీకి తేదీ ఖరారు Thu, Apr 17, 2025, 06:38 PM