"మట్టి కుస్తీ" డైరెక్టర్ తో మాస్ రాజా న్యూ ప్రాజెక్ట్ ..?

by సూర్య | Mon, Nov 28, 2022, 09:04 PM

మాస్ రాజా రవితేజ తన సొంత బ్యానర్ RT టీం వర్క్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ద్విభాషా చిత్రం "మట్టి కుస్తీ / గట్టి కుస్తీ". ఇందులో కోలీవుడ్ హీరో విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి జంటగా నటించారు. హీరో విష్ణు విశాల్ తో కలిసి రవితేజ ఈ సినిమాను నిర్మించడం జరిగింది. చెల్లా అయ్యావు ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరించగా, జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. డిసెంబర్ 2న ఈ సినిమా తెలుగు, తమిళ భాషలలో గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.


నిన్నే హైదరాబాద్లోని JRC కన్వెన్షన్ లో మట్టి కుస్తీ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో రవితేజ మాట్లాడుతూ... మట్టి కుస్తీ డైరెక్టర్ చెల్లా అయ్యావు, మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకరన్ తో తాను వర్క్ చెయ్యాలని అనుకుంటున్నట్టు మీడియా సుముఖంగా పేర్కొన్నారు. మరి, ఈ ముగ్గురి కాంబోలో న్యూ మూవీ రాబోతుందా ..? అన్న ప్రశ్నకు సరైన సమాధానం రావాల్సి ఉంది.


ప్రస్తుతానికి రవితేజ డైరీ ఫుల్ అయిపొయింది. ప్రస్తుతం వాల్తేరు వీరయ్య (కీ రోల్), రావణాసుర, ధమాకా, టైగర్ నాగేశ్వరరావు సినిమాలలో రవితేజ హీరోగా నటిస్తున్నారు.

Latest News
 
అఫీషియల్ : 'ఏజెంట్' మాస్సివ్ అప్డేట్ లోడింగ్..!! Thu, Feb 02, 2023, 07:11 PM
మరో రెండుగంటల్లోనే ఆహాలో 'పవర్ స్టార్మ్'..!! Thu, Feb 02, 2023, 07:06 PM
జపాన్ లో సెన్సషనల్ రికార్డుని సృష్టించిన 'RRR' Thu, Feb 02, 2023, 07:00 PM
రేపు రిలీజ్ కాబోతున్న 'ప్రేమదేశం' Thu, Feb 02, 2023, 06:58 PM
'వారసుడు' 17 రోజుల AP/TS కలెక్షన్స్ Thu, Feb 02, 2023, 06:54 PM