SSMB 28 సెకండ్ షెడ్యూల్ పై లేటెస్ట్ అప్డేట్..!!

by సూర్య | Mon, Nov 28, 2022, 09:00 PM

క్రేజీ కాంబో సూపర్ స్టార్ మహేష్ బాబు - డైరెక్టర్ త్రివిక్రమ్ మరోసారి జతకట్టిన విషయం తెలిసిందే. దాదాపు పుష్కరకాలం తదుపరి ఈ క్రేజీ కాంబోలో సినిమా రాబోతుండడంతో ప్రేక్షకాభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.


రీసెంట్గానే SSMB 28 ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు గారి మాతృమూర్తి శ్రీమతి ఇందిరా దేవి గారు, ఆపై సూపర్ స్టార్ కృష్ణ గారు వరసగా కాలం చెయ్యడంతో SSMB 28 సెకండ్ షెడ్యూల్ పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. తాజా సమాచారం మేరకు, డిసెంబర్ మొదటి వారంలో అంటే వచ్చే వారంలో కానీ, ఆపై వచ్చే వారంలో కానీ SSMB 28 సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ కాబోతుందని వినికిడి.


పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ శోభన గారు కీరోల్ లో నటించబోతున్నారని టాక్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 28వ తేదీన గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.

Latest News
 
మహేశ్ బాబు, త్రివిక్రమ్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ Sun, Mar 26, 2023, 09:14 PM
ఐపీఎల్ కామెంటేటర్‌గా బాలకృష్ణ Sun, Mar 26, 2023, 08:54 PM
పవన్ సినిమాలో విలన్ గా నటించమని ఆ దర్శకుడు అడిగాడు : మంత్రి మల్లారెడ్డి Sun, Mar 26, 2023, 08:45 PM
తమన్నా ఫోటోస్ ట్రెండింగ్ ! Sun, Mar 26, 2023, 11:54 AM
ట్రెండీ వేర్‌లో క‌వ్విస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ Sun, Mar 26, 2023, 11:24 AM