'నీ కోసమే ఈ అన్వేషణ' సాంగ్ లిరిక్స్

by సూర్య | Mon, Nov 28, 2022, 01:09 PM

నీ కోసమే ఈ అన్వేషణ నీ ధ్యాసలో ఈ ఆలాపన 
ఎడబాటు రేపిన విరహ వేదన నరక యాతన 
కాలమే దీపమై దారి చూపునా... 
నీ కోసమే ఈ అన్వేషణ నీ ధ్యాసలో ఈ ఆలాపన

కళ్ళల్లోన నిన్ను దాచినా ఊహల్లొన ఊసులాడినా 
స్వప్నంలోన ఎంత చూసినా విరహమే తీరదే 
జాజికొమ్మ గాని ఊగినా కాలి మువ్వ గాని మోగినా 
చల్లగాలి నన్ను తాకినా నీవనే భావనే 
ఎదురుగ లేనిదే నాకేం తోచదే రేపటి వేకువై రావే.. 
నీ కోసమే ఈ అన్వేషణ నీ ధ్యాసలో ఈ ఆలాపన

నిన్ను తప్ప కన్ను చూడదే లోకమంత చిమ్మ చీకటే 
నువ్వు తప్ప దిక్కు లేదులే ఓ సఖీ నమ్మవే 
గుండె గూడు చిన్నబోయెనే గొంతు ఇంక మూగబోవునే 
నీవు లేక ఊపిరాడదే ఓ చెలీ చేరవే 
ఆశలు ఆవిరై మోడైపోతినే తొలకరి జల్లువై రావే
నీకోసమే ఈ అన్వేషణ నీ ధ్యాసలో ఈ ఆలాపన
ఎడబాటు రేపిన విరహ వేదన నరక యాతన
కాలమే దీపమై దారి చూపునా... 
నీకోసమే ఈ అన్వేషణ నీ ధ్యాసలో ఈ ఆలాపన 

Latest News
 
సంగీత దర్శకుడు AR రెహమాన్ కు అస్వస్థత Sun, Mar 16, 2025, 11:22 AM
నటి రన్యా రావు సంచలన ఆరోపణలు Sun, Mar 16, 2025, 11:17 AM
‘ది ప్యారడైజ్’ కీలక పాత్ర కోసం బాలీవుడ్ హీరోయిన్ ? Sun, Mar 16, 2025, 10:42 AM
హీరో విశ్వక్ సేన్ సోదరి ఇంట్లో భారీ చోరీ Sun, Mar 16, 2025, 10:35 AM
'జాక్' సెకండ్ సింగల్ విడుదల ఎప్పుడంటే..! Sat, Mar 15, 2025, 08:49 PM