పూజా కార్యక్రమంతో ప్రారంభమైన ధనుష్ - శేఖర్ కమ్ముల మూవీ ..!!

by సూర్య | Mon, Nov 28, 2022, 01:08 PM

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సార్ అనే డైరెక్ట్ తెలుగు సినిమాతో టాలీవుడ్ ని పలకరించబోతున్న విషయం తెలిసిందే. వెంకీ అట్లూరి డైరెక్షన్లో తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల కాబోతుంది.


తాజాగా ధనుష్ తన రెండో తెలుగు సినిమాను అఫీషియల్ గా ఎనౌన్స్ చేసారు. ఈ మేరకు ఈ రోజే ఈ మూవీ పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం అయ్యింది. పోతే, ఈ సినిమా శేఖర్ కమ్ముల డైరెక్షన్లో త్రిభాషా చిత్రంగా తెరకెక్కనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ LLP బ్యానర్ పై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్, నారాయణ్ దాస్ నారంగ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అతి త్వరలోనే మూవీ సెట్స్ పైకి వెళ్లబోతుందని మేకర్స్ ప్రకటించారు.


ఈ సినిమాలో నటించబోయే నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించిన మరిన్ని వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.  

Latest News
 
అఫీషియల్ : 'ఏజెంట్' మాస్సివ్ అప్డేట్ లోడింగ్..!! Thu, Feb 02, 2023, 07:11 PM
మరో రెండుగంటల్లోనే ఆహాలో 'పవర్ స్టార్మ్'..!! Thu, Feb 02, 2023, 07:06 PM
జపాన్ లో సెన్సషనల్ రికార్డుని సృష్టించిన 'RRR' Thu, Feb 02, 2023, 07:00 PM
రేపు రిలీజ్ కాబోతున్న 'ప్రేమదేశం' Thu, Feb 02, 2023, 06:58 PM
'వారసుడు' 17 రోజుల AP/TS కలెక్షన్స్ Thu, Feb 02, 2023, 06:54 PM