![]() |
![]() |
by సూర్య | Mon, Nov 28, 2022, 09:53 AM
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నుండి ఈ ఏడాది మాచర్ల నియోజకవర్గం సినిమా వచ్చింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోయింది. అంతకుముందు నుండి వరస ఫ్లాప్స్ అందుకుంటున్న నితిన్ కు ఈ సినిమా వల్ల ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో కొంత టైం తీసుకుని, నిన్ననే న్యూ మూవీ షూటింగ్ ను స్టార్ట్ చేసారు.
నితిన్ కెరీర్ లో 32వ సినిమాగా రూపొందుతున్న ప్రాజెక్ట్ కు వక్కంతం వంశీ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఇందులో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ హ్యారిస్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నిఖితారెడ్డి నిర్మిస్తున్నారు.
ఈ మూవీ షూటింగ్ నిన్నే అఫీషియల్ గా స్టార్ట్ అయ్యింది. అంతకుముందు ఆల్రెడీ కొంతమేర షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా న్యూ షెడ్యూల్ మారేడుమిల్లి గ్రామంలో జరుగుతుంది.
Latest News