లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమౌతున్న ప్రభాస్ ..!!

by సూర్య | Sat, Nov 26, 2022, 09:36 PM

నాలుగు సినిమాలతోనే కోలీవుడ్ మోస్ట్ హప్పెనింగ్ డైరెక్టర్ గా మారారు లోకేష్ కనగరాజ్. ఆయన తెరకెక్కించిన ఖైదీ, మాస్టర్, విక్రమ్... సినిమాలు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో కల్ట్ యాక్షన్ మూవీస్ గా ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. ప్రస్తుతం లోకేష్ విజయ్ తో రెండో సినిమాను చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఆపై ఖైదీ సీక్వెల్, ఆపై విక్రమ్ సీక్వెల్.. లతో లోకేష్ డైరీ కొన్నేళ్ల వరకు ఖాళీగానే లేదు.


తాజా బజ్ ప్రకారం, లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ కూడా భాగం అవ్వనున్నారని తెలుస్తుంది. ఇప్పటికే వీరిద్దరి మధ్య కథాచర్చలు కూడా ప్రారంభమయ్యాయట. అన్ని కుదిరితే, వీరిద్దరి కాంబోలో భారీ యాక్షన్ మూవీ వచ్చే అవకాశాలున్నాయి. ఐతే, ఈ విషయంలో ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

Latest News
 
ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న 'ముఖచిత్రం' Fri, Feb 03, 2023, 09:33 AM
శంకరాభరణం విడుదల తేదీనే కాలం చేసిన కళాతపస్వి ..!! Fri, Feb 03, 2023, 09:30 AM
అజిత్ 'తునివు' డిజిటల్ ఎంట్రీ డేట్ ఫిక్స్ ..!! Fri, Feb 03, 2023, 09:16 AM
అమిగోస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ డీటెయిల్స్ ..!! Fri, Feb 03, 2023, 09:01 AM
చిత్ర పరిశ్రమలో మరో విషాదం.... కళాతపస్వి విశ్వనాథ్ కన్నుమూత Fri, Feb 03, 2023, 12:04 AM