ప్రభాస్ "ఆదిపురుష్" విడుదల మరోసారి వాయిదా ?

by సూర్య | Sat, Nov 26, 2022, 09:34 PM

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ "ఆదిపురుష్" టీజర్ తో ఇటీవలి కాలంలో ఏ స్టార్ హీరో ఎదుర్కోనంత నెగిటివిటీని ఎదుర్కొన్నారు. ఆడియన్స్ వ్యూస్ ను పరిగణనలోకి తీసుకున్న మేకర్స్ విడుదల తేదీని వాయిదా వేసి, బెటర్ విజువల్ ఎక్స్పీరియెన్స్ ఇచ్చేందుకు VFX పై మరింత వర్క్ చెయ్యడానికి నడుం బిగించారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కావాల్సిన ఆదిపురుష్ జూన్ 16కి వాయిదా పడింది.


ఐతే, మళ్ళీ ఆదిపురుష్ మూవీ వాయిదా పడే అవకాశాలున్నాయని, ఇక ఆదిపురుష్ వచ్చేది 2024లోనే అని కొంతమంది అంటున్నారు. తాజా అధికారిక సమాచారం ప్రకారం, ఆదిపురుష్ మూవీని సాధ్యమైనంతవరకు షెడ్యూల్డ్ డేట్ కి అంటే జూన్ 16న విడుదల చేసేందుకు మేకర్స్ కృషి చేస్తున్నారని తెలుస్తుంది. ఇప్పటివరకైతే విడుదల తేదీ మార్చాలన్న ఆలోచన కూడా టీం కు లేదని తెలుస్తుంది.


తన్హాజి ఫేమ్ ఓం రౌత్ డైరెక్షన్లో తెరెకెక్కిన ఈ మైథలాజికల్ మూవీలో ప్రభాస్ శ్రీరాముడిగా, కృతిసనన్ సీతగా నటించారు.

Latest News
 
ఎర్ర చీరలో దివి వయ్యారాలు Mon, Jan 20, 2025, 02:10 PM
మోడ్రన్ డ్రస్ లో మడోన్నా సెబాస్టియన్ Mon, Jan 20, 2025, 02:08 PM
సినీ నటుడు విజయ్‌ రంగరాజు కన్నుమూత Mon, Jan 20, 2025, 12:38 PM
ప్రభాస్ 'ది రాజా సాబ్' నుంచి సీన్ లీక్..... Mon, Jan 20, 2025, 12:13 PM
అఖిల్ పెళ్ళికి ముహూర్తం కుదిరింది Mon, Jan 20, 2025, 11:58 AM