"మట్టి కుస్తీ" ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల

by సూర్య | Wed, Nov 23, 2022, 08:35 PM

FIR చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన కోలీవుడ్ నటుడు విష్ణు విశాల్. తెలుగులో ఆయన నటిస్తున్న కొత్త సినిమా "మట్టి కుస్తీ". తమిళంలో "గట్టకుస్తి". తెలుగు,తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి చెల్లా అయ్యవు దర్శకత్వం వహిస్తుండగా, విష్ణు విశాల్ స్టూడియోస్, ఆర్ టీ టీం వర్క్స్ బ్యానర్ పై రవితేజ, విష్ణు విశాల్ నిర్మిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్గా నటిస్తుంది.


లేటెస్ట్ గా మట్టికుస్తీ ఫస్ట్ లిరికల్ సాంగ్ 'చల్ చక్కని చిలక' విడుదలైంది. హీరో హీరోయిన్ల వివాహ నేపథ్యంలో వచ్చే ఈ బ్యూటిఫుల్ లవ్ మెలోడీ వినడానికి చాలా బాగుంది. ఈ పాటను సింగర్ హేమచంద్ర పాడగా, రెహమాన్ లిరిక్స్ అందించారు.


పోతే, తెలుగు, తమిళ భాషలలో డిసెంబర్ 2న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కాబోతుంది.

Latest News
 
స్మాల్ స్క్రీన్ పై "లైగర్" పవర్ పంచ్... ఎప్పుడంటే..? Sun, Dec 04, 2022, 11:15 PM
పవన్ కళ్యాణ్ - సుజీత్ సినిమాపై ప్రభాస్ రియాక్షనిదే ..!! Sun, Dec 04, 2022, 11:04 PM
18 పేజెస్ : "టైమివ్వు పిల్ల" రిలీజ్ టైం ఫిక్స్..!! Sun, Dec 04, 2022, 10:45 PM
హిట్ 2 చూసిన బాలకృష్ణ ... ఏమన్నారంటే..? Sun, Dec 04, 2022, 09:54 PM
రుద్రంగి : పవర్ఫుల్ "మల్లేష్" గా ఆశిష్ గాంధీ ..!! Sun, Dec 04, 2022, 09:52 PM