మరొక బయోపిక్ డైరెక్ట్ చెయ్యనున్న సుధా కొంగర ..!!

by సూర్య | Wed, Nov 23, 2022, 08:13 PM

గురు, ఆకాశం నీ హద్దురా చిత్రాలతో కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ చిత్రపరిశ్రమలలో చాలా మంచి పేరు తెచ్చుకున్నారు లేడీ డైరెక్టర్ సుధా కొంగర. ప్రస్తుతం ఆకాశం నీ హద్దురా సినిమాను హిందీలో రీమేక్ చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఇందులో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్నారు. హీరో సూర్య స్పెషల్ రోల్ లో నటిస్తున్నారు.


తాజా సమాచారం ప్రకారం, సుధా కొంగర మరొక బయోపిక్ మూవీని తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తుంది. ఆకాశం నీ హద్దురా సినిమా ఎయిర్ డెక్కన్ ఫౌండర్ గోపినాధ్ బయోపిక్ కాగా, ఆ సినిమాకు రీసెంట్గా నేషనల్ అవార్డు వచ్చింది. సుధా తన నెక్స్ట్ మూవీని కూడా బయోపిక్ గా తియ్యాలని నిర్ణయించుకోవడం విశేషం.


దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా జీవితగాధను యంగర్ జనరేషన్ కు తెలిపేందుకు ఈ సినిమా తెరకెక్కించాలని నిర్ణయించుకున్నారట. ప్రస్తుతం అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయట. పోతే, ఈ బయోపిక్ లో సూర్య మరియు అభిషేక్ బచ్చన్ ఇద్దరూ నటించబోతున్నారని ప్రచారం జరుగుతుంది.

Latest News
 
'గుర్తుందా శీతాకాలం' ప్రీ రిలీజ్ ఈవెంట్ డీటెయిల్స్ ..!! Mon, Dec 05, 2022, 10:25 AM
USA లో కొనసాగుతున్న హిట్ 2 కలెక్షన్ల వేట..!! Mon, Dec 05, 2022, 10:16 AM
వివాహజీవితంలోకి అడుగుపెట్టిన హీరోయిన్ హన్సిక..!! Mon, Dec 05, 2022, 10:05 AM
లేటెస్ట్.. వాయిదా పడిన 'ధమ్కీ' ఫస్ట్ సింగిల్ విడుదల  Mon, Dec 05, 2022, 09:52 AM
పవన్ కళ్యాణ్ - సుజీత్ సినిమాపై చరణ్ వైరల్ ట్వీట్ ..!! Mon, Dec 05, 2022, 09:18 AM