![]() |
![]() |
by సూర్య | Wed, Nov 23, 2022, 08:15 PM
నాచురల్ స్టార్ నాని త్వరలోనే "దసరా" సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో నాని పాన్ ఇండియా బరిలోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో మాస్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం, దసరా మేకర్స్ మూవీ టీం కి స్పెషల్ సర్ప్రైజింగ్ ట్రీట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అదేంటి.. సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటే, లేక కమర్షియల్ గా బిగ్ సక్సెస్ ఐతే కదా.. ఇలాంటి స్పెషల్ ట్రీట్స్ ఉండేది అనుకుంటున్నారా... నిజమే కానీ, దసరా మూవీ టీం ఎక్కువశాతం ధుమ్ము, ధూళిలోనే షూటింగ్ జరుపుకున్న కారణంగా చిత్రబృందం అద్భుతమైన పని తీరు చూపించడంతో ఔట్ పుట్ చాలా బాగా వచ్చిందట. దీంతో చిత్రబృందం పనితీరుకి మెచ్చిన మేకర్స్ 28 ఐ ఫోన్ 14 సిరీస్ ఫోన్లను బహుమతిగా ఇచ్చారట. ఈ విషయంతో దసరా సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 23న పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతుంది.
Latest News