రెండు కధలపై పని చేస్తున్న రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్..!!

by సూర్య | Wed, Nov 23, 2022, 08:11 PM

ఇండియాస్ మోస్ట్ హప్పెనింగ్ డైరెక్టర్ రాజమౌళి సినిమాలు ఎక్కువశాతం ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్ గారు అందించిన కథలతోనే రూపొందుతుంటాయి. బాహుబలి 1,2, RRR సినిమాలు కూడా ఆయన రచనలో నుండి పుట్టుకొచ్చినవే. విజయేంద్రప్రసాద్ గారి బలమైన కధలకు రాజమౌళి అందించే విజువల్స్, టేకింగ్ కరెక్ట్ గా సెట్ అవ్వడంతో వీరి కాంబోలో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయఢంకా మోగిస్తున్నాయి.


తాజా సమాచారం ప్రకారం, ప్రస్తుతం విజయేంద్రప్రసాద్ గారు ఒకేసారి రెండు సినిమా కథలపై పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. ఒకటి - RRR సీక్వెల్ స్టోరీ, మరొకటి - మహాభారతం స్క్రీన్ అడాప్టేషన్. ఇండియన్ ఆడియన్స్ తో పాటుగా విదేశీ ప్రేక్షకులు RRR సినిమాకు సీక్వెల్ కోరుకుంటున్న నేపథ్యంలో తాజాగా బయటకొచ్చిన వార్త వారిలో ఫుల్ ఖుషిని నింపుతుంది.

Latest News
 
నిఖిల్ కోసం పాటా పాడిన తమిళ హీరో శింబు Sun, Nov 27, 2022, 11:13 AM
ఈ వారం బిగ్ బాస్ నుండి మోడల్ ఎలిమినేట్ Sun, Nov 27, 2022, 11:01 AM
'గుర్తుందా శీతాకాలం' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ Sun, Nov 27, 2022, 10:48 AM
నేడు జరుగనున్న సూపర్ స్టార్ కృష్ణ సంస్మరణ సభ Sun, Nov 27, 2022, 10:42 AM
సోషల్ మీడియా డిబట్ చేసిన హీరో అజిత్ భార్య..!! Sun, Nov 27, 2022, 10:03 AM