గ్రాఫిక్స్ సినిమా తీశారేంటి...ఆదిపురుష్ పై వెల్లువెత్తుతున్న విమర్శలు

by సూర్య | Wed, Oct 05, 2022, 05:41 PM

విడుదలకు ముందు ఆదిపురుష్ కు ఎదురుదెబ్బ తగలింది. ఇదిలావుంటే బాలీవుడ్ లో ప్రస్తుతం బాయ్ కాట్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. దీని దెబ్బకు ఇప్పటికే పలు బాలీవుడ్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇప్పుడు ఇది మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరకు వచ్చింది. ప్రభాస్ తాజా చిత్రం 'ఆదిపురుష్' విడుదల కావడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఇటీవలే విడుదలయింది. అయితే, ఈ ట్రైలర్ పై పలువురు పెదవి విరుస్తున్నారు. రామాయణంను ఒక రేంజ్ లో తీస్తారనుకుంటే... చివరకు గ్రాఫిక్స్ సినిమా తీశారేంటని విమర్శిస్తున్నారు. బొమ్మల సినిమాలా ఉందని అంటున్నారు. అంతేకాదు... రావణాసురుడు, హనుమంతుడు ఎలా ఉంటారో తెలియదా... వారిని అలా చూపిస్తారా? అని మండిపడుతున్నారు. అంతేకాదు... బ్యాన్ ఆదిపురుష్, బాయ్ కాట్ ఆదిపురుష్ అనే హ్యాష్ ట్యాగ్ లను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. హిందూ మతవిశ్వాసాలను దెబ్బతీయడం బాలీవుడ్ కు అలవాటయిందని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 

Latest News
 
ఓటీటీలోకి వ‌చ్చేసిన ‘మైదాన్’ మూవీ Wed, May 22, 2024, 01:54 PM
బంపర్ ఆఫర్ అందుకున్న మృణాల్ Wed, May 22, 2024, 11:03 AM
అతడి ప్రవర్తన చూసి భయమేసింది: హీరోయిన్ కాజల్ Wed, May 22, 2024, 10:21 AM
'రాజు యాదవ్' నాలగవ సింగల్ ని విడుదల చేయనున్న స్థార్ డైరెక్టర్ Tue, May 21, 2024, 08:45 PM
తన సినీ కెరీర్‌ను వదిలేయనున్న స్టార్ హీరోయిన్ Tue, May 21, 2024, 08:43 PM