by సూర్య | Wed, Oct 05, 2022, 05:28 PM
మల్లిడి వశిస్ట్ దర్శకత్వంలో టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్‌రామ్ నటించిన 'బింబిసార' సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ మూవీలో కేథరిన్ త్రెసా అండ్ సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ZEE5 సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, అక్టోబర్ 21, 2022న ఈ సినిమా zee5 ప్లాట్‌ఫారమ్‌లో ప్రదర్శించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. బింబిసార సినిమాకి చిరంతన్ భట్ సంగీతాన్ని అందించారు. వెన్నెల కిషోర్, శ్రీనివాస రెడ్డి ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కె హరి కృష్ణ నిర్మిస్తున్నారు.
Latest News