by సూర్య | Wed, Oct 05, 2022, 12:03 PM
ప్రదీప్ వర్మ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు 'అల్లూరి' సినిమాలో నటించిన సంగతి అందరికి తెలిసిందే. అల్లూరి సినిమా సెప్టెంబరు 23న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యి సినీ ప్రేమికుల నుండి మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 1.24 కోట్లు వసూలు చేసింది.
ఈ సినిమాలో శ్రీవిష్ణు అల్లూరి సీతారామ రాజుగా కనిపించనున్నాడు. కయాదు లోహర్ ఈ సినిమాలో శ్రీ విష్ణుకి జోడిగా నటిస్తుండగా, సుమన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు. లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ ఈ సినిమాని నిర్మిస్తుండగా, బెక్కం బబిత ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
'అల్లూరి' కలెక్షన్స్ ::::
నైజాం : 0.35 కోట్లు
సీడెడ్ : 0.19 కోట్లు
ఉత్తరాంధ్ర : 0.21 కోట్లు
ఈస్ట్ : 0.11 కోట్లు
వెస్ట్ : 0.07 కోట్లు
గుంటూరు : 0.12 కోట్లు
కృష్ణా : 0.16 కోట్లు
నెల్లూరు : 0.07 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 1.24 కోట్లు