అంచనాలను మరింత పెంచేసిన ఘోస్ట్ రిలీజ్ ట్రైలర్ ..!!

by సూర్య | Fri, Sep 30, 2022, 04:30 PM

నాగార్జున, సోనాల్ చౌహన్ జంటగా నటించిన "ది ఘోస్ట్" మూవీ నుండి కొంచెంసేపటి క్రితమే రిలీజ్ ట్రైలర్ విడుదలయ్యింది. మునుపటి ట్రైలర్ ప్రేక్షకుల దృష్టిని ఒక్కసారిగా ఆకర్షించి, సినిమాపై మంచి అంచనాలను ఏర్పరిస్తే, తాజాగా విడుదలైన ట్రైలర్ వెండితెరపై పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని, అలానే మరోపక్క హార్ట్ టచింగ్ సెంటిమెంట్ ఉంటుందని క్లారిటీ ఇచ్చేసింది. దీంతో అక్కినేని అభిమానులు దసరా పండుగ కోసం ఎంతో కుతూహలంగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే, ఆ రోజే థియేటర్లలో ఘోస్ట్ మూవీ విడుదల కాబోతుంది మరి.ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాకు భరత్ సౌరభ్ సంగీతం అందించారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ llp, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సునీల్ నారంగ్, రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మిస్తున్నారు.

Latest News
 
రైటర్ పద్మభూషణ్ రెండ్రోజుల బాక్సాఫీస్ కలెక్షన్లు..!! Sun, Feb 05, 2023, 06:34 PM
NTR 32 పై సెన్సేషనల్ బజ్..!! Sun, Feb 05, 2023, 06:29 PM
మేనల్లుడి సినిమాకు ఆల్ ది బెస్ట్ చెప్పిన సూపర్ స్టార్..!! Sun, Feb 05, 2023, 06:10 PM
డిజిటల్ స్ట్రీమింగ్ పార్ట్నర్ ఫిక్స్ చేసుకున్న ధనుష్ "సార్" Sun, Feb 05, 2023, 05:58 PM
ఓవర్సీస్ లో 'రైటర్ పద్మభూషణ్' రాకింగ్ కలెక్షన్లు..!! Sun, Feb 05, 2023, 05:42 PM