'ప్రిన్స్' రెండవ సింగిల్‌ విడుదలకి తేదీ ఖరారు

by సూర్య | Thu, Sep 22, 2022, 08:07 PM

తమిళ హీరో శివకార్తికేయన్ జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ తో డైరెక్ట్ తెలుగు మూవీ తీసుతున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. ఈ సినిమాకి 'ప్రిన్స్' అని టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజాగా ఇప్పుడు కామెడీ ఎంటర్‌టైనర్‌ ట్రాక్ లో రానున్న ఈ సినిమా రెండవ సింగిల్‌ని సెప్టెంబర్ 23 సాయంత్రం 5:30 గంటలకు విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. జెస్సికా అనే టైటిల్‌తో ఉన్న ఒక స్పెషల్ పోస్టర్ ని మేకర్స్ విడుదల చేసారు.


ఈ సినిమాలో  శివకార్తికేయన్ సరసన ఉక్రెయిన్ బ్యూటీ మెరీనా ర్యాబోషప్కా జోడిగా కనిపించనుంది. సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, సురేష్ బాబుతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ పతాకాలపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోనాలి నారంగ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. తమిళ-తెలుగు మూవీకి టాప్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Latest News
 
OTT భాగస్వామిని లాక్ చేసిన 'కృష్ణమ్మ' Fri, Apr 26, 2024, 05:51 PM
'ఆ ఒక్కటి అడక్కు' లోని మెలోడియస్ సాంగ్ హమ్మమ్మో అవుట్ Fri, Apr 26, 2024, 05:46 PM
అనుపమ పరమేశ్వరన్ తదుపరి చిత్రానికి ఆసక్తికరమైన టైటిల్‌ ఖరారు Fri, Apr 26, 2024, 05:38 PM
'ది 100' టీజర్ అవుట్ Fri, Apr 26, 2024, 05:29 PM
ఈ వారం థియేటర్స్ లో విడుదల కానున్న కొత్త టైటిల్స్ Fri, Apr 26, 2024, 03:17 PM