సోషల్ మీడియా హ్యాండ్లింగ్ పై ఫ్యాన్స్ కు విజయ్ ఫుల్ క్లారిటీ

by సూర్య | Fri, Aug 19, 2022, 06:04 PM

లైగర్ ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ ఛార్మీ తో జరిగిన ఇంటర్వ్యూలో హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ... తన సోషల్ మీడియా ఖాతాలైన ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి వాటిని డైరెక్ట్ గా తాను యూజ్ చెయ్యనని, అసలు అలాంటి యాప్స్ తన మొబైల్ లో ఉండవని చెప్పి ఫ్యాన్స్ ను నిరుత్సాహ పరిచారు. తన క్లోజ్ ఫ్రెండ్స్ తన సోషల్ మీడియా హ్యాండ్లింగ్ చేస్తారని, తన సోషల్ మీడియా ఖాతాల నుండి ఏ పోస్ట్ వచ్చినా, ఎలాంటి పోస్ట్ వచ్చినా, అది నేను పెట్టినట్టే భావించాలని, తన గ్రీన్ సిగ్నల్ తోనే పోస్ట్స్ పోస్ట్ చెయ్యబడతాయని చెప్పారు.
ఫ్యాన్స్ తో టచ్ లో ఉండడానికి ఉన్న ఏకైక మార్గం సోషల్ మీడియానే కనుక సోషల్ మీడియాలో తాను చాలా చురుగ్గా ఉంటానని చెప్పారు. ఒక సినిమాకు కమిటైతే ప్రాణం పెట్టి చేస్తానని, ఆ సమయంలో సినిమా, షూటింగ్ గురించి తప్పితే మరొక దాని గురించి ఆలోచించనని, సోషల్ మీడియా ఖాతాలను హ్యాండిల్ చేసే టైం తన వద్ద లేకపోవడంతోనే ఫ్రెండ్స్ కు ఆ బాధ్యత అప్పగించానని తెలిపారు. 

Latest News
 
'సాలార్' రెండో ట్రైలర్ త్వరలో విడుదల కానుందా? Sun, Dec 03, 2023, 09:03 PM
MMA నేర్చుకుంటున్న 'గుంటూరు కారం' నటి Sun, Dec 03, 2023, 09:00 PM
'ఈగిల్' మొదటి సింగిల్ విడుదలకి తేదీ లాక్ Sun, Dec 03, 2023, 08:58 PM
పిక్ టాక్ : రొమాంటిక్ గెట‌వేలో వరుణ్ తేజ్, లావణ్య Sun, Dec 03, 2023, 08:55 PM
డుంకీని బీట్ చేసిన 'సాలార్' Sun, Dec 03, 2023, 08:48 PM