విడుదలకు ముందు లైగర్ నుండి బ్లాస్టింగ్ సర్ప్రైజ్

by సూర్య | Fri, Aug 19, 2022, 05:24 PM

విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ ల పాన్ ఇండియా డెబ్యూ మూవీ "లైగర్". ఆగస్టు 25వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ మూవీ పై దేశవ్యాప్త ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
లేటెస్ట్ గా పూరి, విజయ్, చార్మీ ల ఎంగేజింగ్ ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియో ఒకటి రిలీజ్ అయ్యింది. ఇందులో పూరి మాట్లాడుతూ... లైగర్ సినిమా నుండి తొలి లిరికల్ సాంగ్ గా రిలీజైన "ఎట్టాక్" ను పూర్తి వీడియో రూపంలో సినిమా విడుదలకు ముందే ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసే విధంగా రిలీజ్ చేస్తామని పూరి బిగ్ అప్డేట్ ఇచ్చారు.
అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ కీలక అతిథి పాత్రలో నటించారు. బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ తో కలిసి పూరి కనెక్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.

Latest News
 
'బడ్డీ' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్ Mon, Jun 24, 2024, 06:35 PM
'గురువాయూర్ అంబలనాడయిల్' డిజిటల్ ఎంట్రీకి తేదీ ఖరారు Mon, Jun 24, 2024, 06:33 PM
ఈ తేదీన ఓపెన్ కానున్న 'ఇండియన్ 2' కెనడా బుకింగ్స్ Mon, Jun 24, 2024, 06:31 PM
5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'గోట్' సెకండ్ సింగల్ Mon, Jun 24, 2024, 06:29 PM
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిసిన ప్రముఖ తెలుగు నిర్మాతలు Mon, Jun 24, 2024, 06:27 PM