ఈ నెల 11 నుండి అమెజాన్ ప్రైమ్ లో 'థాంక్యూ' మూవీ స్ట్రీమింగ్

by సూర్య | Wed, Aug 10, 2022, 10:51 AM

నాగ చైతన్య నటించిన 'థాంక్యూ' మూవీ అప్పుడే ఓటీటీ బాట పట్టింది. గత నెల 22న రిలీజైన ఈ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టడంతో మూడు వారాల్లోనే ఓటీటీ ప్రీమియర్స్ కు సిద్ధమైంది. ఈ నెల 11 నుంచి అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ కానుంది. ప్రత్యేకమైన స్టోరీ లైన్ తో మిమ్మల్ని సంతోషాల సముద్రంలో ముంచెత్తడానికి వాళ్లు వచ్చేస్తున్నారు అంటూ ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్‌ను ప్రైమ్ వీడియో అనౌన్స్ చేసింది. ఈ చిత్రానికి విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించారు. చైతూకి జంటగా రాశీఖన్నా నటించింది. జీవితంలో మనం ఎదగడానికి సాయపడిన వాళ్లను గుర్తుంచు కొని, వాళ్లకు కృతజ్ఞత చూపాల్సిన అవసరాన్ని ఈ సినిమా చూపించింది. అయితే కథ-కథనాలు గ్రిప్పింగ్ గా సాగకపోవడంతో ప్రేక్షకులు రిజెక్ట్ చేశారు. ఇటీవల కాలంలో థియేటర్స్ లో ఆడని కొన్ని సినిమాలు ఓటీటీలో అదరగొట్టడం చూశాం. #ThankYou కూడా ఈ జాబితాలో చేరుతుందేమో చూడాలి.

Latest News
 
ఈ వారం విడుదల కానున్న OTT సినిమాలు మరియు సిరీస్ Fri, May 10, 2024, 04:51 PM
లవ్ మౌళి ఓవర్సీస్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Fri, May 10, 2024, 04:48 PM
'థగ్ లైఫ్‌' లో భాగమైనందుకు ఆనందంగా ఉంది - అలీ ఫజల్ Fri, May 10, 2024, 04:46 PM
ప్రైమ్ లో ప్రసారానికి అందుబాటులోకి వచ్చిన 'లవ్ గురు' Fri, May 10, 2024, 04:43 PM
వెంకటేష్ తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించేది అప్పుడేనా? Fri, May 10, 2024, 04:34 PM